న్యూఢిల్లీ, అభ్యుదయం తెలంగాణలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు.
అధికారంలోకి వచ్చేందుకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదని, ఒంటరి పోరాటంతోనూ సాధిస్తామని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో కలిసి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో ఆయన భేటీ అయ్యారు. సంస్థాగత విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.






