ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో మొదటిసారి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. నేత కార్మికుల సంక్షేమమే ప్రధాన అస్త్రంగా మార్కెటింగ్ సదుపాయాల కోసం 'నేతన్న బజార్' ఏర్పాటుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 99.40 కోట్లతో కూడిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరగనున్నాయి.

మరింత సమాచారం కోసం దయచేసి అభ్యుదయం పేజీ నెంబర్ 2 (తేదీ: 29-09-2026) చూడండి