ఓటమి భయంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలు, దళితులు, మైనారిటీల ఓట్లను దొంగిలించేందుకు కుట్ర చేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేపట్టిన నిరసనలో ఆయన వరుసగా రెండో రోజు పాల్గొన్నారు. బ్రిటిష్ వారి విభజించు-పాలించు ఎత్తుగడలను అమలు చేస్తూ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
పేదల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది: ఢిల్లీ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి
దేశంలోని పేదలు, బడుగు బలహీన వర్గాల ఓటు హక్కును బీజేపీ హరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ఇండియా కూటమి ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
అక్షర పరిమాణం
- ఎన్నికల్లో ఓటమి భయంతోనే దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది ఓట్లను తొలగించే ప్రక్రియకు తెరతీశారని ఆరోపించారు.
- ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించకపోతే ప్రజాక్షేత్రంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.






