దానం నాగేందర్‌పై అనర్హత వేటుతో ప్రధాన పార్టీల్లో ముదిరిన ఖైరతాబాద్ ఉపఎన్నిక టెన్షన్!
దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్, బీజేపీల్లో టికెట్ ఆశిస్తున్న నేతల పోటీ పార్టీ నాయకత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది.
అక్షర పరిమాణం
🕒 29, సెప్టెం 2026👁 4 వీక్షణలు
కాంగ్రెస్ టికెట్ కోసం దానం నాగేందర్‌కు పోటీగా తెరపైకి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి. బలమైన అభ్యర్థిని తేల్చేందుకు 6 బృందాలతో బీజేపీ అధిష్ఠానం ముమ్మర క్షేత్రస్థాయి సర్వే
ఖైరతాబాద్ ఉప ఎన్నికల రేసులో నిలిచిన సీనియర్ నేత దానం నాగేందర్.
ఖైరతాబాద్ ఉప ఎన్నికల వాతావరణం అప్పుడే వేడెక్కింది. కాంగ్రెస్ తరఫున దానం నాగేందర్‌కే మళ్లీ అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతున్న వేళ, ఇది తన తండ్రి పీజేఆర్ స్థానమంటూ విజయారెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. మరోవైపు బీజేపీ నుంచి చింతల రాంచంద్రారెడ్డి, జూటూరి కీర్తిరెడ్డి, నటి జీవిత టికెట్ ఆశిస్తుండటంతో గెలుపు గుర్రం కోసం అధిష్ఠానం ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహిస్తోంది.
ఆర్టికల్ పేజీ నెంబర్: 1 & 2. మరింత సమాచారం కోసం దయచేసి అభ్యుదయం పేజీ నెంబర్ 2 (తేదీ: 29-09-2026) చూడండి.