ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ప్రావిన్స్‌ల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. సింధ్ ప్రావిన్స్‌ను విభజించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ కరాచీలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
న్యాయవాదులు, పౌర హక్కుల కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. సింధ్ చారిత్రక, సాంస్కృతిక గుర్తింపును దెబ్బతీసే నిర్ణయాలను అడ్డుకుంటామని నిరసనకారులు హెచ్చరించారు.






