న్యూఢిల్లీ: వైద్య రంగంలో అరుదైన ఘనత నమోదైంది. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) వైద్యులు గర్భంలో ఉన్న శిశువుకు వెన్నెముక సంబంధిత లోపాన్ని సరిచేసేందుకు ఓపెన్‌ ఫీటల్‌ సర్జరీ నిర్వహించారు.

సాధారణంగా శిశువు పుట్టిన తర్వాత గుర్తించే వెన్నెముక లోపాన్ని గర్భధారణ సమయంలోనే గుర్తించి చికిత్స అందించడం ఈ శస్త్రచికిత్స ప్రత్యేకత. ఈ ప్రక్రియలో వైద్యులు, నర్సులు సహా వివిధ విభాగాల నిపుణులు పాల్గొన్నట్లు పత్రిక పేర్కొంది. శిశువుకు భవిష్యత్తులో నాడీ సంబంధిత సమస్యలు తగ్గించడమే ఈ చికిత్స ప్రధాన లక్ష్యంగా వివరించింది.