న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌తో మంగళవారం ఫోన్‌లో మాట్లాడారు. భారత్‌–జర్మనీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, భారత్‌–యూరోపియన్‌ యూనియన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, రక్షణ, ఆధునిక సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

దౌత్య సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పరస్పర సహకారాన్ని మరింత విస్తరించాల్సిన అవసరాన్ని నేతలు ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం పెంపొందించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని అభిప్రాయపడ్డారు.