యూఎస్ హెచ్-1బీ వీసా రెన్యూవల్ నిబంధనల్లో మార్పులు, సోషల్ మీడియా పరిశీలన కారణంగా వీసా స్లాట్లు వచ్చే ఏడాది జూన్ వరకు వాయిదా పడుతుండటంతో భారత టెక్ నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో భారతదేశానికి వచ్చి ఇరుక్కుపోయిన తమ ఉద్యోగులకు అమెజాన్ సంస్థ మార్చి 2 వరకు రిమోట్ వర్క్ (వర్క్ ఫ్రమ్ హోమ్) చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే కంపెనీ వ్యూహాత్మక నిర్ణయాలు, సున్నితమైన కోడింగ్ సమస్యల పరిష్కారం, స్థానిక అమెజాన్ క్యాంపస్‌లను సందర్శించడంపై కఠిన పరిమితులు విధించింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ సిబ్బందిని దేశం వీడవద్దని హెచ్చరించిన వేళ అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.