కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి పెన్నా బేసిన్ ద్వారా కుప్పం వరకు తరలిస్తున్నప్పుడు, సమీపంలోని పాలమూరుకు నీరు ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రశ్నించారు. పాలమూరుకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన కోరారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడతారా అని నిలదీశారు. కృష్ణా నదిలో నీరు సమృద్ధిగా ఉన్న సమయంలోనూ మోటార్లను ఎందుకు నడపలేదని ప్రశ్నించారు.

రైతులు, బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవడాన్ని ఆయన ఖండించారు. నీటి సమస్యపై ప్రభుత్వ వైఖరి మారాలని, ప్రజల ప్రశ్నలకు జవాబివ్వాలని డిమాండ్ చేశారు.