విపత్తు సమయంలో సిబ్బంది సేవలు ఎనలేనివి. - రూ.80 లక్షల వాటర్ బౌజర్ అగ్నిమాపక వాహనం ప్రారంభం
తుఫాన్లు, వరదలు వంటి విపత్తుల సమయంలో అగ్నిమాపక, విపత్తు నివారణ సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అన్నారు.
అక్షర పరిమాణం
🕒 6, సెప్టెం 2026👁 9 వీక్షణలు
రూ.80 లక్షల నిధులతో అధిక నీటి సామర్థ్యం కలిగిన వాటర్ బౌజర్ ప్రారంభం.
2026 ఏప్రిల్ నుంచి 135 అగ్ని ప్రమాదాలను నియంత్రించినట్లు అధికారులు తెలిపారు.
కొత్త వాటర్ బౌజర్ అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభిస్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య
ఏలూరు అగ్నిమాపక కేంద్రంలో కొత్త వాటర్ బౌజర్ అగ్నిమాపక వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో అగ్నిమాపక సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు.
కొత్త వాహనం ద్వారా మరింత మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల ద్వారా ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలను అధికారులు వివరించారు. 2026 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 135 అగ్ని ప్రమాదాలను నివారించి సుమారు రూ.2.39 కోట్ల విలువైన ఆస్తిని కాపాడినట్లు తెలిపారు.