అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రూప్-2 కేటగిరీలో మొత్తం 720 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ పోస్టుల్లో 471 ఎగ్జిక్యూటివ్, 249 నాన్‌ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, పరీక్ష విధానం, దరఖాస్తు గడువును పరిశీలించి అభ్యర్థులు దరఖాస్తు చేయాలని సూచించారు.