రామాంతపూర్ వ్యాపారి కిడ్నాప్ కేసు గుట్టురట్టు: 9 మంది అరెస్ట్, కోటి నగదు సీజ్
నకిలీ పోలీసు అవతారమెత్తి రామాంతపూర్‌కు చెందిన నగల వ్యాపారిని అపహరించిన ముఠాను హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
అక్షర పరిమాణం
🕒 18, అక్టో 2026👁 6 వీక్షణలు
నిందితుల నుంచి రూ.1.07 కోట్ల నగదు, బంగారం, 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాలే కిడ్నాప్‌నకు ప్రధాన కారణమని విచారణలో వెల్లడైంది.
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న సికింద్రాబాద్ డీసీపీ రక్షితమూర్తి.
నగరంలోని గోల్నాక ఫ్లైఓవర్ వద్ద రామాంతపూర్ జ్యువెలరీ వ్యాపారి శ్రీనివాసరావును కిడ్నాప్ చేసి రూ.1.30 కోట్లు వసూలు చేసిన కేసును చిక్కడపల్లి పోలీసులు ఛేదించారు. సికింద్రాబాద్ డీసీపీ రక్షితమూర్తి మీడియాకు వివరాలు వెల్లడిస్తూ.. అక్టోబర్ 5న పోలీసులమని నమ్మించి వ్యాపారిని తీసుకెళ్లి బంధించారని, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సీసీటీవీ, సాంకేతిక ఆధారాల ద్వారా 9 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
మరింత సమాచారం కోసం అభ్యుదయం ఈ-పేపర్ తేదీ: 18-10-2026, పేజీ నంబర్: 3 చదవండి