హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగ్‌లు కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక విభాగం G.O.Rt.No.1654 జారీ చేసింది.
ప్రస్తుతం తెలంగాణ డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా ఉన్న మహేష్ మురళీధర్ భగవత్, IPSను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. ఆయన వీ.సీ. సజ్జనార్, IPS స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
డా. సౌమ్య మిశ్రా, IPSను డీజీపీ – మహిళా భద్రత, SHE Teams, భరోసా విభాగాలకు నియమించారు. ఆమెకు డీజీపీ ఆర్గనైజేషన్, డీజీపీ లీగల్ బాధ్యతలను అదనంగా అప్పగించారు.
స్వాతి లక్రా, IPSను డీజీపీ – జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్‌గా నియమిస్తూ, డీజీపీ హోంగార్డ్స్ బాధ్యతలను అదనంగా అప్పగించారు.
చారు సిన్హా, IPSను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. ఆమెకు CID డీజీపీ బాధ్యతలను అదనంగా అప్పగించారు.
డా. అనిల్ కుమార్, IPSను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఆయన స్థానంలో విక్రమ్ సింగ్ మన్, IPSను గ్రేహౌండ్స్ & ఆక్టోపస్ డీజీపీ (ఆపరేషన్స్)గా నియమించారు.
వీ.సీ. సజ్జనార్, IPSను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ & సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. అదనంగా SPF డీజీ బాధ్యతలు కూడా అప్పగించారు.
వై. నాగిరెడ్డి, IPSను సివిల్ సప్లైస్ కమిషనర్ & ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఆయనకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ & ఎండీ, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ బాధ్యతలను అదనంగా అప్పగించారు.
ఇక ఎం. స్టీఫెన్ రవీంద్ర, IPSను తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (TG-TMARS) డైరెక్టర్‌గా నియమించారు. అకున్ సభర్వాల్, IPSకు అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) బాధ్యతలు అప్పగించారు.
ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, IPSను ACB డైరెక్టర్‌గా, కార్తికేయ, IPSను మల్టీ-జోన్-I ఐజీపీగా నియమించారు. కె. రమేష్ నాయుడు, IPSను రైల్వేస్ ఐజీపీగా నియమించగా, డి. జోయెల్ డేవిస్, IPSకు TG-TMARSలో రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ బాధ్యతలు అప్పగించారు.
జి. చందన దీప్తి, IPSకు జోగులాంబ జోన్-VII డీఐజీ బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఆర్. భాస్కరన్, IPSకు తెలంగాణ డీఐజీ (ఇంటెలిజెన్స్) బాధ్యతలు అప్పగించారు. కె. నారాయణ నాయక్, IPSకు బాసర జోన్-II డీఐజీ బాధ్యతలు అదనంగా ఇచ్చారు.
ఎల్.ఎస్. చౌహాన్, IPSను డీఐజీ కోఆర్డినేషన్‌గా నియమించారు. శ్రీ బాలాదేవి, IPSను TG-TMARS డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్)గా, వి. అరవింద బాబు, IPSను హైదరాబాద్ సిటీ డీసీపీ, SM&ITగా నియమించారు.
ఈ బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం 12 నవంబర్ 2026న జారీ చేసింది.






