ప్రముఖ వెబ్‌సైట్ గుడ్ రిటర్న్స్ వివరాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం నాటికి నగరాలవారీగా పసిడి ధరలు భగ్గుమన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర అత్యధికంగా రూ.1,37,240 పలకగా, హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాల్లో రూ.1,36,200 వద్ద కొనసాగింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర చెన్నైలో రూ.1,25,800కు, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరుల్లో రూ.1,24,850 వద్ద నమోదైంది.

వెండి ధరలు కూడా భారీ పెరుగుదలను నమోదు చేశాయి. హైదరాబాద్, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర గరిష్టంగా రూ.2.60 లక్షలకు చేరగా, ముంబై, బెంగళూరుల్లో రూ.2.42 లక్షల వద్ద ట్రేడైంది. బంగారం ఫ్యూచర్స్ (ఏప్రిల్) ధర రూ.721 పెరిగి రూ.1,40,424ను తాకింది. పండుగల సీజన్ కావడంతో పాటు గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.