హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నగర విస్తరణ, మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

హైదరాబాద్‌ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నగరాన్ని ప్రపంచస్థాయి నగరాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లడంతో పాటు, పెట్టుబడులను ఆకర్షించేలా మౌలిక వసతులను మెరుగుపరచనున్నట్లు తెలిపారు