విజయనగరం, అభ్యుదయం భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ అండగా నిలిచారని ఉద్ఘాటించారు. పోలవరం, రైల్వేజోన్, విశాఖ ఉక్కును కాపాడారని ప్రశంసించారు.
ఎయిర్‌పోర్టుకు భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనాలు చేస్తున్నానని పేర్కొన్నారు.






