వారం రోజుల వ్యవధిలోనే విరుచుకుపడిన అర్నబ్, మురసు తుఫాన్ల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్, రహదారులు, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు కేంద్రానికి వివరించారు. బాధితులను ఆదుకోవడానికి, దెబ్బతిన్న మౌలిక వసతులను వేగంగా పునరుద్ధరించడానికి కేంద్ర హోంశాఖ తక్షణమే ఆర్థిక సాయం విడుదల చేయాలని కోరారు. మరోవైపు సీఎం బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించి రేటూరు గ్రామ సమీపంలో నీటమునిగిన వరి పొలాలను కాలినడకన పరిశీలించి బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
జంట తుఫాన్లతో ఏపీకి ₹1,919.59 కోట్ల నష్టం: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
వరుస తుఫాన్ల కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, ప్రాథమికంగా ₹1,919.59 కోట్ల నష్టం వాటిల్లినందున తక్షణ మధ్యంతర సాయం అందించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు
అక్షర పరిమాణం
- 'అర్నబ్', 'మురసు' తుఫాన్ల వల్ల వ్యవసాయ రంగానికి ₹874.96 కోట్ల నష్టం వాటిల్లింది.
- 1.43 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, 1.86 లక్షల మందికి పైగా రైతులు నష్టపోయారు.
- ఉద్యాన పంటల రంగానికి ₹387.10 కోట్ల నష్టం సంభవించింది.
- వరద నీరు తగ్గిన తర్వాత సమగ్ర నష్టాన్ని అంచనా వేసి మరో 15 రోజుల్లో పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని వెల్లడి.






