రూఫ్‌టాప్ సోలార్ రంగంలో ఉన్న ఫ్రెయిర్ ఎనర్జీ సంస్థ ప్రచారకర్తగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వినియోగం పర్యావరణ పరిరక్షణకు ఎంతో కీలకమని, కుటుంబాలు సోలార్ విద్యుత్‌ను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 40కి పైగా నగరాల్లో 24 వేలకు పైగా ఇళ్లలో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

మరింత సమాచారం కోసం అభ్యుదయం ఈ-పేపర్ తేదీ: 18-10-2026, పేజీ నంబర్: 3 చదవండి.