న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సైబర్ నేరాలను అరికట్టడంలో సోషల్ మీడియా సంస్థలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించింది.

డిజిటల్ మోసాలకు ఉపయోగిస్తున్న మార్గాలను గుర్తించి వాటిని అడ్డుకునే చర్యలు చేపట్టాలని, బ్యాంకులు కూడా అనుమానాస్పద లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోర్టు సూచించింది.

సైబర్ నేరాల నివారణకు తీసుకున్న సాంకేతిక చర్యలు, ఇతర వివరాలను సంబంధిత అధికారులకు అందించాలని పేర్కొంది.