హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. దీపావళి సందర్భంగా సాదానగర్‌లోని ఇందిరమ్మ ఇళ్లలో నిర్వహించిన వేడుకల వీడియోను పరిశీలించిన ఆయన, పేద కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ తదితర కార్యక్రమాలు ప్రజలకు ప్రయోజనం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాయని అభిప్రాయపడ్డారు.