పవన్ కళ్యాణ్‌తో తన బంధంపై వస్తున్న ఊహాగానాలకు అన్నా లెజ్నోవా తెరదించారు. విడాకులపై ప్రచారం నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో స్పందించిన ఆమె, తమ మధ్య పరస్పర అంగీకారంతోనే నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు.

కుటుంబ సభ్యుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని, పిల్లల పట్ల తల్లిదండ్రులుగా తమ బాధ్యతలు ఎప్పటికీ ఉంటాయని స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాల్లో గోప్యతను గౌరవించాలని కోరారు.