వైద్య రంగంలో దశాబ్దాలుగా పెను సవాలుగా మారిన పాంక్రియాటిక్ (క్లోమ గ్రంథి) క్యాన్సర్ చికిత్సలో అంతర్జాతీయ పరిశోధకులు సరికొత్త మైలురాయిని అధిగమించారు. తీవ్ర దశలో ఉన్న 500 మంది రోగులపై చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌లో ‘దారాక్సాన్రాసిబ్’ (Daraxonrasib) మాత్రలు అద్భుత ఫలితాలను అందించాయి. ఈ మందు వాడిన వారిలో కణితి పరిమాణం తగ్గడంతో పాటు, రోగుల జీవన నాణ్యత మెరుగుపడిందని పరిశోధన వెల్లడించింది. కీమోథెరపీతో పోలిస్తే చర్మ సమస్యలు, నోటి పుండ్లు వంటి స్వల్ప దుష్ప్రభావాలు మినహా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉండటం విశేషం.