తియ్యటి మక్కజొన్నలను పచ్చివిగా తిన్నా, ఉడకబెట్టుకుని తిన్నా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ముఖ్యంగా బ్రెస్ట్, లివర్ క్యాన్సర్ నివారణలో ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పైల్స్ సమస్యతో బాధపడేవారికి ఇందులోని పీచు పదార్థం చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. అంతేకాకుండా స్వీట్ కార్న్‌లో ఉండే ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఎముకలు, కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడతాయి. నిత్యం ఒత్తిడితో పనిచేసే వారికి ఇందులోని ఫినోలిక్ ఫైటో కెమికల్స్ మంచి మందులా పనిచేసి రక్తపోటును అదుపులో ఉంచుతాయి.