స్త్రీ జన్మించినప్పటి నుంచే అండాల సంఖ్య పరిమితంగా ఉండి, వయసు పెరిగే కొద్దీ క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇది వృద్ధాప్య ప్రక్రియలో సహజమైన భాగమే అయినప్పటికీ, దీనివల్ల 30 లేదా 40 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం పూర్తిగా కష్టమవుతుందని భావించకూడదని నిపుణులు చెబుతున్నారు. మహిళలు 20 ఏళ్ల వయసు నుంచే పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటే 30 ఏళ్లలోనే కాకుండా 40 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యకరమైన గర్భధారణ సాధ్యమవుతుందని సూచిస్తున్నారు.