అభ్యుదయం - ఫ్లాట్లు, విల్లాలు నిర్మించి ఇస్తామంటూ కొనుగోలుదారుల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి మోసగించిన సాహితి ఇన్‌ఫ్రాటెక్ వ్యవహారంపై ఈడీ విచారణను ముమ్మరం చేసింది. బాధితుల ఫిర్యాదుల మేరకు తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ, నిధుల మళ్లింపు కోణంలో తీవ్ర విచారణ జరుపుతోంది. ప్రాథమికంగా రూ.248 కోట్ల మోసంగా భావించినప్పటికీ, తదుపరి దర్యాప్తులో ఈ కుంభకోణం విలువ రూ.842 కోట్లకు చేరినట్లు ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బ్యాంకు ఖాతాల ద్వారా సాహితి ఇన్‌ఫ్రాతో రూ.2.1 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ లావాదేవీల అసలు ఉద్దేశం, వ్యాపార సంబంధాలపై ప్రశ్నించేందుకు ఆయనకు సమన్లు పంపింది. ఇప్పటికే ఈ కేసులో సంస్థ ఎండీ లక్ష్మీనారాయణను అరెస్టు చేయడంతో పాటు, 56 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి, దాదాపు రూ.173 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
For more information on this article, read page number 3 of అభ్యుదయం (Abhyudayam) e-paper dated 26-09-2026






