విశాఖ సీఐఐ సమ్మిట్‌లో రూ.11 లక్షల కోట్ల ఎంఓయూలు.. 2.5 లక్షల మందికి ఉపాధి!
విశాఖపట్నంలో జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. ఈ సదస్సులో రూ.11 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదరనున్నాయని కూటమి నేతలు వెల్లడించారు.
అక్షర పరిమాణం
🕒 12, నవం 2026👁 3 వీక్షణలు
58 దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు, 18 దేశాల నుంచి మంత్రులు సహా మొత్తం 3,500 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నారు.
ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని నేతలు తెలిపారు
విశాఖపట్నంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం ముస్తాబైన ప్రాంగణం
విశాఖపట్నం, అభ్యుదయం: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం వేదికగా జరగనున్న 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్-2026 ఏర్పాట్లను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీభరత్, కూటమి ఎమ్మెల్యేలు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ, దేశానికి వచ్చే పెట్టుబడులలో 25 శాతం ఏపీకే వస్తున్నాయని తెలిపారు. భారత ఉపరాష్ట్రపతితో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కుదిరిన 714 ఎంఓయూలలో 75 శాతం కార్యరూపం దాల్చాయని, తాజా సమ్మిట్‌తో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు.