విశాఖపట్నం నగరానికి తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలేరు, కనితి, రైవాడ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమీక్షించినట్టు చెప్పారు. అవసరమైతే లిఫ్ట్ పథకాలు, పైప్‌లైన్లు, పంపుల ద్వారా నీటిని తరలించే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. సాగు అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, నగర తాగునీటి డిమాండ్ మధ్య సమతుల్యత సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
విశాఖకు తాగునీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక
: సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖపట్నం తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
అక్షర పరిమాణం
- ఏలేరు నుంచి కనితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటి సరఫరా పెంపుపై పరిశీలన.
- రైవాడకు పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి ప్రత్యామ్నాయ నీటి సరఫరా అవకాశాల పరిశీలన.



