వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత కీలకమని నాదెండ్ల మనోహర్ అన్నారు. కూటమిలోని పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచనలను పాటిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలను కూడా ఆయన ప్రస్తావించారు.
పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యం: నాదెండ్ల మనోహర్
విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఐక్యంగా పనిచేయాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
అక్షర పరిమాణం
- విశాఖ మున్సిపల్ ఎన్నికలు జనసేనకు కీలకమని వ్యాఖ్య.
- పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో, అపోహలకు దూరంగా ఉండాలని సూచన.



