న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కొత్త వేరియంట్ పీజే.2.1 వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కెనడాలో తొలిసారిగా గుర్తించిన ఈ వేరియంట్ ప్రస్తుతం ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నట్లు కథనం పేర్కొంది.

ఈ వేరియంట్ జన్యుమార్పులు, మానవ కణాల్లోకి ప్రవేశించే సామర్థ్యం, ఇతర వేరియంట్లతో పోలిస్తే దాని ప్రభావం వంటి అంశాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. లక్షణాల ఆధారంగా మాత్రమే వైరస్‌ను నిర్ధారించడం సాధ్యం కాదని, శాస్త్రీయ పరీక్షలు అవసరమని పరిశోధకుల అభిప్రాయం.