రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 0.25 శాతం పెంచి 8.25 శాతానికి చేర్చడంతో గృహ, వాహన రుణాలు తీసుకున్న వారిపై తక్షణ ప్రభావం పడింది. బ్యాంకులు ఈ భారాన్ని సర్దుబాటు చేసేందుకు రుణగ్రహీతలకు రెండు మార్గాలు ఇస్తాయి: 1) నెలవారీ ఈఎంఐ మొత్తాన్ని పెంచడం, 2) లోన్ రీపేమెంట్ వ్యవధిని (Tenure) పొడిగించడం. అయితే ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటే వినియోగదారుడికి మేలు జరుగుతుందనే దానిపై మార్కెట్ విశ్లేషకులు స్పష్టమైన గణాంకాలను వెల్లడించారు.

ఉదాహరణకు.. ఒక వ్యక్తి రూ.40 లక్షల హోమ్ లోన్‌ను 20 ఏళ్ల కాలవ్యవధికి 8% వడ్డీతో తీసుకుంటే నెలకు రూ.41,822 ఈఎంఐ చెల్లిస్తుంటారు. ఇప్పుడు వడ్డీ 8.25 శాతానికి చేరినప్పుడు.. మొదటి ఆప్షన్ ఎంచుకుని నెలవారీ ఈఎంఐని రూ.42,600 కు పెంచితే (నెలవారీ రూ.780 అదనం), 20 ఏళ్లకు అదనంగా చెల్లించే మొత్తం కేవలం రూ.1,87,200 మాత్రమే అవుతుంది. కానీ ఈఎంఐ భారం కాకూడదని రెండో ఆప్షన్ కింద కాలవ్యవధిని మరో ఏడాది (12 నెలలు) పొడిగిస్తే, అదనంగా ఏకంగా రూ.5 లక్షలకు పైగా చెల్లించాల్సి వస్తుంది. అంటే ఈఎంఐ పెంచుకోవడమే రూ.3 లక్షల పైచిలుకు ఆదా చేస్తుందని గణాంకాలు రుజువు చేస్తున్నాయి.