సాధారణంగా అందరూ ఎండిన బాదం పప్పులను నానబెట్టుకుని తింటుంటారు. అయితే మార్కెట్లో తాజాగా లభించే పచ్చి బాదం కాయల్లోని లేత పప్పు మరింత పోషక విలువలను కలిగి ఉంటుందని ఆహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లేత పచ్చి బాదంలో పీచు (ఫైబర్) అధికంగా ఉండటం వల్ల కొద్ది మోతాదులో తీసుకున్నా కడుపు నిండిన భావన కలిగి ఆకలిని తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పచ్చి బాదంలో విటమిన్-ఈ, ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణజాలం దెబ్బతినకుండా కాపాడతాయి. రక్తనాళాల్లో పూడికలను కరిగించి రక్త ప్రసరణ సాఫీగా సాగేందుకు దోహదపడతాయి. అధిక రక్తపోటు (బీపీ) సమస్యతో బాధపడేవారు సీజన్‌లో లభించే పచ్చి బాదం పప్పులను పరిమితంగా తీసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు.

మరింత సమాచారం కోసం ‘అభ్యుదయం’ ఈ-పేపర్ పేజీ నంబర్ 7 చూడండి (తేదీ: 25-09-2026).