ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికల ప్రక్రియలో తెరవెనుక భారీ కుట్ర సాగుతోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. లక్షలాది కాదు.. ఏకంగా కోట్ల సంఖ్యలో అర్హులైన ఓట్లను తొలగించడం ద్వారా బీజేపీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్‌లో తలెత్తిన విభేదాలు బయటకు రావడం తీవ్రమైన అంశమని, నిబంధనలను ఉల్లంఘించిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదంపై న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇతర ఎన్నికల కమిషనర్లైన సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి నమోదు చేసిన 14 అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా సీఈసీ తీసుకున్న నిర్ణయాలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. కాగా, సవరణలన్నీ చట్టబద్ధమైన నిబంధనల ప్రకారమే జరిగాయని, తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవమేనని కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.

For more information on this article, read page number 1, 2 & 3 of అభ్యుదయం (Abhyudayam) e-paper dated 26-09-2026