అమరావతి, అభ్యుదయం రాష్ట్రంలో అవయవ మార్పిడి కోసం వేలాది మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. జీవన్‌దాన్ తాజా గణాంకాల ప్రకారం 2026 జూలై 1 నాటికి మొత్తం 5,839 మంది వివిధ అవయవాల కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు.
వీరిలో అత్యధికం మూత్రపిండాల కోసం ఎదురుచూస్తున్నారు. బ్రెయిన్ డెడ్ దాతల సంఖ్య పెరుగుతుండటంతో అవయవ మార్పిడి సేవలు విస్తరిస్తున్నాయి.






