అభ్యుదయం - అమరావతి అమరావతి:
పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన డ్యామ్ సివిల్ వర్క్స్ 90 శాతం, డయాఫ్రామ్ వాల్ పనులు 94 శాతం మేర పూర్తయ్యాయని వివరించారు.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఈ నెలాఖరులోగా రూ.600 కోట్ల ప్యాకేజీ విడుదల చేయనున్నట్లు చెప్పారు. విశాఖ నగరంలో తాగునీటి ఎద్దడి రాకుండా గోదావరి నుంచి ఏలేరు ద్వారా 3 టీఎంసీల నీటిని తరలిస్తున్నామని, రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు సివిల్ వర్క్స్ 90 శాతం పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
పోలవరం ప్రాజెక్టులో ప్రధాన సివిల్ పనులు 90 శాతం పూర్తయ్యాయని, వెలిగొండ నిర్వాసితులకు నెలాఖరులోగా రూ.600 కోట్లు పరిహారం చెల్లిస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
అక్షర పరిమాణం
-
- విశాఖపట్నం తాగునీటి అవసరాల కోసం ఏలేరు రిజర్వాయర్ ద్వారా 3 టీఎంసీల గోదావరి జలాలు విడుదల.
- రాష్ట్రంలోని 36 ప్రాజెక్టుల పురోగతిని నెలకు ఒకసారి స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు.






