హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల రక్షణ కోసం గురువారం అర్ధరాత్రి 'ఆపరేషన్ కవచ్' పేరిట విస్తృత నాకాబందీ నిర్వహించినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ తెలిపారు. 3 వేల మంది పోలీసు సిబ్బందితో కూడిన 100 ప్రత్యేక బృందాలు ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహించాయన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 725 వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, 48 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఒక అక్రమ ఆయుధం రికవరీ కావడంతో పాటు, రెండు గంజాయి కేసులు, పలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని సీపీ వివరించారు.
నగరంలో అర్ధరాత్రి 'ఆపరేషన్ కవచ్'.. 48 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!
నేరాల నియంత్రణే లక్ష్యంగా హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ కవచ్' నాకాబందీలో 48 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని, 725 వాహనాలను సీజ్ చేశారు
అక్షర పరిమాణం
- దాదాపు 100కు పైగా బృందాలు, 3 వేల మంది పోలీసులతో నగరం అంతటా ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్లను తారుమారు చేసినా, స్పష్టంగా ఉంచకపోయినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.






