కూకట్‌పల్లి ఏఎస్ రాజునగర్‌లోని ఆదర్శ్ ఆటోమోటివ్స్‌లో న్యూ బెలినో కారును ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ, న్యూ బెలినోకు ఫ్రీ బుకింగ్ ప్రారంభమైనప్పటి నుంచే కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించిందన్నారు.
కొత్త బెలినోలో మెరుగైన భద్రతా ఫీచర్లతో పాటు అత్యాధునిక సాంకేతిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా బెలినోకు ఇప్పటికే 18 లక్షలకుపైగా సంతృప్తి చెందిన వినియోగదారులు ఉన్నారని, అదే విశ్వాసాన్ని కొనసాగించేలా ఈ కొత్త మోడల్‌ను రూపొందించామని పేర్కొన్నారు.
వినియోగదారుల అభిరుచులు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సౌకర్యాలు, కొత్త ఫీచర్లతో న్యూ బెలినోను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కొత్త మోడల్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తుందని ఆదర్శ్ ఆటోమోటివ్స్ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.






