రాష్ట్రంలో ప్రజలకు మరింత మెరుగైన పోషకాహార, వైద్య సేవలు అందించేందుకు కొత్త కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.
నూతనంగా 21 పోషకాహార కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా మరో 175 పడకలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 21 కేంద్రాలు పనిచేస్తుండగా వాటిలో 340 పడకలు అందుబాటులో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. కొత్త కేంద్రాల ఏర్పాటుతో సేవల పరిధి మరింత విస్తరించనుంది.