హైదరాబాద్‌లో విపత్తుల నిర్వహణ, చెరువుల పరిరక్షణ, ఆస్తుల రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు సులభంగా అందించేందుకు హైడ్రా అధికారిక వెబ్‌సైట్, పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
చెరువుల హద్దులు, కాలువల వివరాలు, ప్రభుత్వ భూములు, వరద ప్రభావిత ప్రాంతాలు వంటి సమాచారాన్ని ప్రజలు తెలుసుకునే అవకాశం కల్పించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో అత్యవసర సమాచారాన్ని పొందేందుకు 1070 హెల్ప్‌లైన్‌ను కూడా అందుబాటులో ఉంచారు.
ఒక్క క్లిక్‌తో పలు రకాల సేవలు
హైదరాబాద్ ప్రజలకు వాతావరణం, చెరువులు, వరద పరిస్థితులు, నిర్మాణాలు తదితర సమాచారాన్ని ఒకే వేదికపై అందించేందుకు ‘హైడ్రా’ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా సమాచారం అందించడమే దీని ఉద్దేశం.
అక్షర పరిమాణం
- చెరువులు, వరదలు, నిర్మాణాలు, వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని పోర్టల్‌లో పొందే అవకాశం.
- అత్యవసర హెల్ప్‌లైన్ 1070ను అందుబాటులో ఉంచారు.






