ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక పరిషత్ సమరానికి తెరలేచింది. రాష్ట్రంలోని 28 జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలోని 659 జెడ్పీటీసీ, 659 మండలాల్లోని 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా నోటిఫికేషన్ జారీ చేశారు. అక్టోబర్ 21న నోటీసు ప్రదర్శించి నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఇచ్చారు. నవంబర్ 3న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.81 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మరింత సమాచారం కోసం అభ్యుదయం ఈ-పేపర్ తేదీ: 20-10-2026, పేజీ నంబర్: 2 & 3 చదవండి.