హైదరాబాద్, అభ్యుదయం ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్‌లో తన క్లౌడ్ సేవలను మరింత విస్తరించింది. హైదరాబాద్ కేంద్రంగా "ఇండియా సౌత్ సెంట్రల్" పేరుతో తన నూతన క్లౌడ్ రీజియన్‌ను ప్రారంభించింది.
ఈ కొత్త రీజియన్‌తో దేశంలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంటర్‌ప్రైజ్ సేవలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు సంస్థ వెల్లడించింది.
తెలంగాణలో ఏర్పాటైన ఈ నూతన రీజియన్ ద్వారా వినియోగదారులు తమ డేటాను స్థానికంగానే భద్రపరుచుకోవచ్చు.





