పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ బకాయిల వివాదంలో హైకోర్టు జారీ చేసిన క్రిమినల్ ధిక్కరణ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని గమనించిన బెంచ్, అధికారులపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు, జవాబుదారీతనంపై స్పందిస్తూ వారిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించడమే మేలని ధర్మాసనం అభిప్రాయపడింది.