గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 లేదా తత్సమాన పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (PCB), ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశిత వైద్య అర్హతలను కూడా అభ్యర్థులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
2026లో NEET-UG పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మిగిలిన ఖాళీ సీట్లను 10+2 PCB మార్కుల మెరిట్ ఆధారంగా, నిబంధనల ప్రకారం భర్తీ చేస్తారు.
5½ ఏళ్ల కోర్సు
BNYS కోర్సు మొత్తం 5½ సంవత్సరాల పూర్తి కాల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఇందులో 4½ సంవత్సరాల అకడమిక్, క్లినికల్ శిక్షణతో పాటు ఏడాది పాటు కంపల్సరీ రొటేటరీ రెసిడెన్షియల్ ఇంటర్న్‌షిప్ (CRRI) ఉంటుంది. నేచురోపతి, యోగా రంగాల్లో సైద్ధాంతిక విద్యతో పాటు విస్తృతమైన క్లినికల్ శిక్షణ అందిస్తారు.
ఈ కోర్సును కేంద్ర విశ్వవిద్యాలయమైన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత యూనివర్సిటీ, న్యూఢిల్లీ అనుబంధంతో నిర్వహిస్తున్నారు. నేచురోపతి, యోగా విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో BNYS కోర్సు అందుబాటులోకి రావడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
25 ఎకరాల్లో నిసర్గ్ గ్రామ క్యాంపస్
పుణెలోని యేవలేవాడిలో ఉన్న NIN నిసర్గ్ గ్రామ క్యాంపస్ 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 250 పడకల నేచురోపతి ఆసుపత్రి, విద్యా–పరిశోధన సదుపాయాలు, బాలురు–బాలికలకు ప్రత్యేక హాస్టళ్లు, ఆధునిక యోగా హాళ్లు, నేచురోపతి చికిత్సకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 29 సెప్టెంబర్ 2026న ప్రారంభమైంది. 19 అక్టోబర్ 2026 సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. 27 అక్టోబర్న ప్రొవిజనల్ మెరిట్ జాబితా, 30 అక్టోబర్న తుది మెరిట్/వెయిటింగ్ జాబితాను విడుదల చేయనున్నారు.
కౌన్సెలింగ్‌ను నవంబర్ 12–13, నవంబర్ 18–19 తేదీల్లో నిర్వహించనున్నారు. కొత్త విద్యా సంవత్సరం తరగతులు నవంబర్ 30, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.
మరిన్ని వివరాలకు
దరఖాస్తు విధానం, ప్రాస్పెక్టస్, ఫీజు వివరాలు, అర్హతలు తదితర పూర్తి సమాచారాన్ని NIN అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు: www.ninpune.ayush.gov.in
అడ్మిషన్ హెల్ప్‌లైన్: +91 7965220180, 9511693564
ఈ-మెయిల్: admission@bnysnin.in






