రోజూ మనం తినే బ్రెడ్, బిస్కెట్లు, నూడుల్స్, బేకరీ కేకులు, సమోసాల్లో మైదా ప్రధాన పదార్థంగా మారింది. రుచిగా ఉన్నప్పటికీ ఇందులో పోషకాలు, పీచు పదార్థం (ఫైబర్) శూన్యం. కేవలం రెండు వారాల పాటు మైదాను పూర్తిగా తీసుకోకుండా ఉంటే శరీరంలో స్పష్టమైన సానుకూల మార్పులు కనిపిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మొదటిగా, ఫైబర్ లేని మైదా స్థానంలో సంపూర్ణ ధాన్యాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగవంతమై కడుపు ఉబ్బరం తగ్గి పొట్ట తేలికగా మారుతుంది.
మైదా ఉత్పత్తులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచి అంతే వేగంగా తగ్గించడం వల్ల తరచూ నీరసం, తియ్యటి పదార్థాలు తినాలనే కోరిక (Cravings) కలుగుతుంది. మైదాను మానేస్తే రక్తంలో చక్కెర సమతుల్యమై నిరంతర శక్తి లభిస్తుంది. అంతేకాకుండా, ప్రాసెస్డ్ మైదాను దూరం పెట్టడం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గి ముఖంపై మొటిమలు, చర్మ సమస్యలు తగ్గుముఖం పడతాయి. మైదా స్థానంలో గోధుమలు, జొన్నలు, రాగులు, ఓట్స్ వంటి సంపూర్ణ పోషకాహారాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు.
రెండు వారాల పాటు మైదా తినడం మానేస్తే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!
కేవలం రెండు వారాల పాటు ఆహారంలో మైదాను పూర్తిగా పక్కన పెడితే జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు బరువు తగ్గడం, చర్మ సౌందర్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అక్షర పరిమాణం
- మైదాలో ఫైబర్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి నీరసం, కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది.
- మైదాకు బదులుగా జొన్నలు, రాగులు, ఓట్స్ తీసుకోవడం వల్ల ప్రేగుల్లో వాపు (Inflammation) తగ్గి శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి.






