మెడికవర్ ఇండియాలో పెట్టుబడులు పెంచాలని కేకేఆర్ ఇండియా నిర్ణయించినట్లు కథనం తెలిపింది. దేశీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ విస్తరణకు, మెరుగైన సేవలు అందించేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని కేకేఆర్ ఇండియా ప్రతినిధులు పేర్కొన్నారు.

2017లో ప్రారంభమైన మెడికవర్ ఆస్పత్రులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 ఆస్పత్రుల్లో 4,800 పడకలతో సేవలు అందిస్తున్నాయి. 80 క్లినికల్ స్పెషాలిటీల్లో 1,900 మంది వైద్యులు పనిచేస్తున్నట్లు కథనం పేర్కొంది.

ఆధునిక క్లినికల్ మౌలిక వసతులు, నిపుణులైన వైద్య సేవలను విస్తరించడమే లక్ష్యమని సంస్థ వెల్లడించింది.