విదేశీ మదుపర్లు పెద్దఎత్తున నిధులు ఉపసంహరించుకోవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో గురువారం అమ్మకాల వెల్లువ కొనసాగింది. ఒక్కరోజే దాదాపు రూ.10,148 కోట్ల విలువైన షేర్లను విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు విక్రయించారు. ఆటో, మెటల్స్, రియల్టీ తదితర కీలక రంగాలు కుదేలవడంతో బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.9 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది.

మరింత సమాచారం కోసం అభ్యుదయం ఈ-పేపర్ తేదీ: 18-10-2026, పేజీ నంబర్: 7 చదవండి.