డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించబడిన లేదా గల్లంతైన అర్హులైన పౌరులకు కేంద్ర ఎన్నికల సంఘం గొప్ప ఉపశమనం అందించింది. కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఎన్యుమరేషన్ ఫారం మరియు చిరునామా ఆధారాలతో ఆన్లైన్ ద్వారానే తమ వివరాలను పునరుద్ధరించుకోవచ్చని తెలిపింది. అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి తుది ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చేలా గ్రామాలు, వార్డుల్లో మరోసారి జాబితాలను ప్రదర్శించాలని అధికారులను ఆదేశించింది.
ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైతే గుడ్ న్యూస్: ఈసీ ప్రత్యేక నమోదు అవకాశం
ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని పౌరులు ఫారం-8 సమర్పించకుండానే, చిరునామా ధ్రువీకరణతో తుది జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది.
అక్షర పరిమాణం
- తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఏడు రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు (సీఈవో) ఆదేశాలు జారీ.
- గైర్హాజరు, ఇల్లు మారడం, డూప్లికేట్ వంటి కారణాలతో ఓటు కోల్పోయిన (ASD) వారికి భారీ ఊరట.
- పాత ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌తో ఈసీ మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.
- బూత్ స్థాయి అధికారులు (బీఎల్వో) రాజకీయ పార్టీల ఏజెంట్లతో కలిసి ఇంటింటి సర్వే చేపట్టాలని ఆదేశం.






