హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, సురక్షిత పెట్టుబడిగా పరిగణించే విలువైన లోహాలకు పెరిగిన డిమాండ్ కారణంగా దేశీయంగా ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ వివరాల ప్రకారం.. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 1,50,930 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల (ఆభరణాల) బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 1,38,350 వద్ద స్థిరపడింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 1,13,200కు చేరింది.

మరోవైపు వెండి ధరల్లో తీవ్ర పెరుగుదల కనిపించింది. పారిశ్రామిక అవసరాలు, ఎలక్ట్రానిక్స్ రంగం నుంచి భారీ డిమాండ్ కారణంగా కిలో వెండి ధరపై ఏకంగా రూ. 10,000 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 100 గ్రాముల వెండి రూ. 26,500 కాగా, కేజీ వెండి ధర రూ. 2,65,000 వద్ద ఆల్‌టైమ్ హై రికార్డును తాకింది. ఢిల్లీ మార్కెట్లోనూ 10 గ్రాముల బంగారం రూ. 1,54,800 వద్ద కొనసాగుతుండగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 4,635 డాలర్లు, వెండి 73.69 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.