జీఐ ట్యాగ్‌తో కుప్పడం పట్టు చీరలకు మరింత విశిష్టత లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

చేనేత కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఉచిత విద్యుత్, రూ.25 వేల ఆర్థిక సాయంతో చేనేత కుటుంబాలకు ఊరట లభిస్తుందని చెప్పారు.

పట్టు చీరల ప్రత్యేకత, సంప్రదాయ నేత వృత్తి నైపుణ్యం, మార్కెట్ పరిస్థితులపై వారితో చర్చించారు.