ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు మరియు ఉన్నత విద్య పరిరక్షణ కోసం భాగ్యారథి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో కళాశాల టీచింగ్ మరియు నాన్-టీచింగ్ స్టాఫ్ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
కాలేజ్ డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్ మాట్లాడుతూ, “ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాలు, సిబ్బంది కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి” అని డిమాండ్ చేశారు.
కాలేజ్ ప్రిన్సిపాల్ నవీన్ రాజ్ మాట్లాడుతూ, “విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను సకాలంలో విడుదల చేయాలి. విద్యార్థులు మరియు కళాశాలల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తక్షణ పరిష్కారం చూపాలి” అని విజ్ఞప్తి చేశారు.
కళాశాల ప్రతినిధులు ఉపాధ్యాయ దినోత్సవం రోజున నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం ద్వారా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని తెలిపారు. ఇది విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపట్టిన శాంతియుత నిరసన అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగ్యారథి డిగ్రీ కాలేజ్ టీచింగ్ స్టాఫ్, నాన్-టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.






