ఐటీ కారిడార్‌లో వాహనాల రద్దీని నియంత్రించేందుకు చేపట్టిన ఫ్లైఓవర్ పనులు వేగవంతం కావడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లింగంపల్లి నుంచి వచ్చే వాహనాలను గచ్చిబౌలి పీఎస్ వద్ద దారి మళ్లించనున్నారు. DLF ఉద్యోగులు తమ వాహనాల రాకపోకలకు సంబంధిత నాన్ గేట్‌ను యథావిధిగా వినియోగించుకోవచ్చని, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని పోలీసులు కోరారు.
సైబరాబాద్ ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మరో 3 నెలలు ట్రాఫిక్ ఆంక్షల పొడిగింపు
గచ్చిబౌలిలోని IIIT జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు.
అక్షర పరిమాణం
- మంగళవారం నుంచి DLF గేట్ నెంబర్-1 నుండి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు ప్రధాన రహదారి పూర్తిగా మూసివేత. గచ్చిబౌలి జంక్షన్ నుంచి ఇందిరానగర్ మీదుగా రాడిసన్, IIIT వైపు వెళ్లేందుకు రూట్ డైవర్షన్ల ఏర్పాటు






